

వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లతో సమావేశం కానున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడం, మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్ అభ్యర్థుల ఎంపికపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. ఎన్నికల సన్నద్ధత, పార్టీ నాయకుల మధ్య సమన్వయం, అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన అంశాలపై వైఎస్ జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి పేరును వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. రేపటి సమావేశంలో మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ అభ్యర్థుల ఎంపికపై చర్చించి, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంపై పార్టీ నాయకత్వం దృష్టి సారించినట్లు సమాచారం.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!