2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 25 - హౌస్‌లో త్రిగుణ్‌-అపూర్వ వార్‌.. డిస్‌క్వాలిఫికేషన్‌తో రచ్చ

Writer: Nithish 12:20 AM, 2 అక్టోబర్, 2026
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 25 - హౌస్‌లో త్రిగుణ్‌-అపూర్వ వార్‌.. డిస్‌క్వాలిఫికేషన్‌తో రచ్చ

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 10లో నాలుగో వారం పోటీలు మరింత ఉత్కంఠగా సాగుతున్నాయి. గత సీజన్లకు భిన్నంగా ఈసారి టాస్క్‌లు, టీమ్‌ గేమ్‌లతో హౌస్‌లో పోటీ వాతావరణాన్ని మరింత పెంచారు. ఇంటి సభ్యులను రెడ్‌, బ్లూ టీమ్‌లుగా విభజించి ఆధిపత్యం కోసం వివిధ టాస్క్‌లను నిర్వహిస్తున్నారు. భైరవ నాయకత్వంలోని రెడ్‌ టీమ్‌ పోటీలో ముందంజలో ఉండగా, సభ్యుల మధ్య వ్యూహాలు, విభేదాలు ఆసక్తిని పెంచుతున్నాయి.

తాజా ఎపిసోడ్‌లో ‘సైల్ టు డామినేషన్’ పేరుతో ప్రత్యేక టాస్క్‌ను నిర్వహించారు. ఇందులో మహిళా కంటెస్టెంట్లు మాత్రమే పాల్గొన్నారు. రెడ్‌ టీమ్‌ తరఫున వర్షిణి, అపూర్వ పోటీపడగా.. బ్లూ టీమ్‌ నుంచి దేబ్జానీ, సృష్టి బరిలోకి దిగారు. చక్రాలతో కూడిన చిన్న పడవ తరహా అమరికపై కూర్చొని, నిర్దేశిత డ్రమ్స్‌ వద్ద ఉన్న కర్రలకు తమ జట్టు జెండాలను వేగంగా అమర్చడం ఈ టాస్క్‌ ప్రధాన ఉద్దేశం.

టాస్క్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే పోటీ తీవ్రంగా మారింది. ఈ క్రమంలో అపూర్వ పడవ తరహా అమరికపై నుంచి కిందపడిపోయింది. సంచాలకుడిగా వ్యవహరిస్తున్న త్రిగుణ్‌.. టాస్క్‌ నిబంధనల ప్రకారం ఆమెను డిస్‌క్వాలిఫై చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ నిర్ణయంపై అపూర్వ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాంప్రసాద్‌, రోహిత్‌ సహా పలువురు సభ్యులు కూడా త్రిగుణ్‌ నిర్ణయాన్ని ప్రశ్నించడంతో హౌస్‌లో వాతావరణం వేడెక్కింది.

తనను ఆట నుంచి తప్పించడానికి త్రిగుణ్‌ వ్యక్తిగత విభేదాలను కారణంగా చూపుతున్నాడని అపూర్వ ఆరోపించింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే ఇతర సభ్యుల ఒత్తిడితో త్రిగుణ్‌ తన నిర్ణయాన్ని మార్చుకుని అపూర్వను తిరిగి ఆటలోకి అనుమతించాడు. అనంతరం టాస్క్‌ కొనసాగగా.. బ్లూ టీమ్‌ సభ్యులు సృష్టి, దేబ్జానీ మెరుగైన ప్రదర్శనతో తమ జట్టుకు విజయాన్ని అందించారు.

ఓటమి అనంతరం అపూర్వ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. తనకు శారీరక బలం సరిపోలేదని, నాన్‌-వెజ్‌ తినకపోవడం వల్ల కూడా బలం తక్కువగా ఉందని ఆమె పేర్కొంది. ఆమె వ్యాఖ్యలతో హౌస్‌లో కొంత సరదా వాతావరణం నెలకొంది. మొత్తంగా టాస్క్‌లు, నామినేషన్లు, టీమ్‌ ఆధిపత్య పోరుతో బిగ్‌బాస్‌ తెలుగు 10లో రోజురోజుకూ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ తెలుగు 10 డే 25 ప్రోమో 2 - షాలిని కన్నీళ్లు, దేబ్జానీ నిర్ణయంతో హౌస్‌లో ఉద్విగ్నత

బిగ్‌బాస్ తెలుగు 10 డే 25 ప్రోమో 2 - షాలిని కన్నీళ్లు, దేబ్జానీ నిర్ణయంతో హౌస్‌లో ఉద్విగ్నత

బిగ్‌బాస్ తెలుగు 10 డే 25 ప్రోమో 1 - బిగ్‌బాస్ హౌస్‌లో నవ్వుల సందడి.. ఇమిటేషన్లతో అదరగొట్టిన నరేశ్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 25 ప్రోమో 1 - బిగ్‌బాస్ హౌస్‌లో నవ్వుల సందడి.. ఇమిటేషన్లతో అదరగొట్టిన నరేశ్

బిగ్ బాస్ తెలుగు 10: రెండు రోజులకే రూ.15 లక్షలతో ఎందుకు బయటికి వచ్చాడో చెప్పిన మిథిలేష్

బిగ్ బాస్ తెలుగు 10: రెండు రోజులకే రూ.15 లక్షలతో ఎందుకు బయటికి వచ్చాడో చెప్పిన మిథిలేష్

బిగ్ బాస్ తెలుగు 10లో మరోసారి గ్రూపిజం రచ్చ..

బిగ్ బాస్ తెలుగు 10లో మరోసారి గ్రూపిజం రచ్చ..

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10త్రిగుణ్అపూర్వబిగ్‌బాస్ హౌస్సైల్ టు డామినేషన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
బిగ్ బాస్ తెలుగు 10: ‘ఉమెన్ కార్డ్’ వాడుతున్నారంటూ లేడీ కంటెస్టెంట్లపై ట్రోలింగ్

బిగ్ బాస్ తెలుగు 10: ‘ఉమెన్ కార్డ్’ వాడుతున్నారంటూ లేడీ కంటెస్టెంట్లపై ట్రోలింగ్

నేనూ మనిషినే.. ఆ కామెంట్లు చాలా బాధపెట్టాయి - ఆర్జే కాజల్

నేనూ మనిషినే.. ఆ కామెంట్లు చాలా బాధపెట్టాయి - ఆర్జే కాజల్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 25 - హౌస్‌లో త్రిగుణ్‌-అపూర్వ వార్‌.. డిస్‌క్వాలిఫికేషన్‌తో రచ్చ
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 25 - హౌస్‌లో త్రిగుణ్‌-అపూర్వ వార్‌.. డిస్‌క్వాలిఫికేషన్‌తో రచ్చ

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు
జనరల్

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ.
జనరల్

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ.

హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారుల భారీ ఆపరేషన్
జనరల్

హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారుల భారీ ఆపరేషన్

తెలంగాణ విద్యుత్ డిమాండ్‌లో సరికొత్త రికార్డు
జనరల్

తెలంగాణ విద్యుత్ డిమాండ్‌లో సరికొత్త రికార్డు

మెట్రో, ఆర్టీసీకి కామన్ పాస్
జనరల్

మెట్రో, ఆర్టీసీకి కామన్ పాస్

2027 వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఐసీసీ
క్రీడలు

2027 వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఐసీసీ

స్మిత్ మచ్చర్‌ సాహసానికి గుర్తింపు.. గుజరాత్‌ ప్రభుత్వం కీలక ప్రకటన
జనరల్

స్మిత్ మచ్చర్‌ సాహసానికి గుర్తింపు.. గుజరాత్‌ ప్రభుత్వం కీలక ప్రకటన

ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ కేబినెట్‌లో కీలక చర్చ
జనరల్

ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ కేబినెట్‌లో కీలక చర్చ

ఆక్వా యూనిట్ల కాలుష్యంపై పవన్‌ కీలక ఆదేశాలు
జనరల్

ఆక్వా యూనిట్ల కాలుష్యంపై పవన్‌ కీలక ఆదేశాలు

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌
జనరల్

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త ఎండీ, సీఈఓగా అనుప్‌ బాగ్చీ
బిజినెస్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త ఎండీ, సీఈఓగా అనుప్‌ బాగ్చీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!