

బిగ్‌బాస్ తెలుగు 10 రివ్యూ డే 72లో పదకొండో వారం నామినేషన్ల ప్రక్రియ రసవత్తరంగా సాగింది. డిక్టేటర్స్ థీమ్‌లో భాగంగా మాజీ కంటెస్టెంట్లను ఇంట్లోకి తీసుకొచ్చి ప్రస్తుత సభ్యులను నామినేట్ చేయించారు. ఈ ప్రక్రియలో శ్రిష్టి, చరణ్, చైత్ర, శ్వేత పాల్గొన్నారు. అంతకుముందు ఝాన్సీ చేసిన వ్యాఖ్యలతో సుధీర్ భావోద్వేగానికి గురయ్యాడు. దేబ్జానీ, త్రిగుణ్ అతడిని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత శ్రిష్టి వర్షిణి టాస్కుల్లో ఆడిన తీరుపై విమర్శలు చేసి, త్రిగుణ్‌కు డ్యాగర్ ఇచ్చింది. దీంతో అతడు ముకేష్‌ను నామినేట్ చేశాడు. ఇతరుల ఓటమిలో సంతోషం వెతుకుతున్నాడంటూ ముకేష్ త్రిగుణ్‌పై విమర్శలు చేశాడు. చైత్ర వంశీని, వర్షిణి అమన్‌ను నామినేట్ చేశారు. హెడ్ కౌంట్ టాస్కులో తన మద్దతును అమన్ తప్పుగా చూపించాడని వర్షిణి ఆరోపించింది.
తర్వాత చరణ్ సుధీర్‌ను నామినేట్ చేసి, అతడి ఆట తీరుపై ప్రశ్నలు లేవనెత్తాడు. చరణ్ ఇచ్చిన డ్యాగర్‌తో రాం ప్రసాద్ శివ్‌ను నామినేట్ చేశాడు. అనంతరం శ్వేత రాం ప్రసాద్‌ను నామినేట్ చేస్తూ అతడిపై విమర్శలు చేసింది. శ్వేత నుంచి డ్యాగర్ అందుకున్న అమన్, కెప్టెన్సీ టాస్కులో తనకు మద్దతు ఇచ్చిన విషయాన్ని కారణంగా చూపిస్తూ త్రిగుణ్‌ను నామినేట్ చేశాడు. చివరగా కెప్టెన్ నరేష్‌కు ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం ఇవ్వగా, శివ్, ఆర్కేలను ఎంపిక చేశాడు. ఇంటి పనులు అప్పగించినా ఆర్కే వాటిని తప్పించుకుంటున్నాడని నరేష్ చెప్పడంతో త్రిగుణ్ మధ్యలో కలగజేసుకున్నాడు. దీంతో ఆర్కే ఆగ్రహంతో త్రిగుణ్‌పై "దొబ్బేయ్" అంటూ అరిచాడు. ఈ మాటలతో త్రిగుణ్, వంశీ సహా ఇతర సభ్యులు ఆర్కేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కెప్టెన్ నరేష్ మినహా మిగతా సభ్యులంతా నామినేషన్లలో ఉండటంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి నెలకొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!