

బిగ్ బాస్ తెలుగు 10 నాలుగో వారం ఎలిమినేషన్ ఉత్కంఠగా మారింది. గత వారం మిథిలేష్ రూ.15 లక్షల నగదు ఆఫర్‌ను స్వీకరించి హౌస్ నుంచి బయటకు వెళ్లడంతో రెగ్యులర్ ఎలిమినేషన్ జరగలేదు. అయితే ఈ వారం తొమ్మిది మంది నామినేషన్లలో ఉన్నారు. త్రిగుణ్, రోహిత్ నాయుడు, ముఖేష్, చరణ్, నరేశ్, షాలిని, దేబ్జానీ, అమన్, సృష్టి ఈ జాబితాలో ఉన్నారు. సోషల్ మీడియాలో వెలువడుతున్న అనధికారిక ఓటింగ్ ట్రెండ్స్‌లో త్రిగుణ్ ముందంజలో ఉండగా, సృష్టి, చరణ్ తక్కువ ఓట్లతో డేంజర్ జోన్‌లో ఉన్నట్లు కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి.
అయితే అధికారిక ఓటింగ్ ఫలితాలు వెల్లడయ్యే వరకు ఎలిమినేషన్‌పై స్పష్టత వచ్చే అవకాశం లేదు. మరోవైపు ఈ వారం కెప్టెన్సీలోనూ కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. కెప్టెన్సీ టాస్క్‌లో అమన్ విజయం సాధించినప్పటికీ, వర్షిణి తనకు లభించిన ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టింది. దీంతో హౌస్‌లో గేమ్ సమీకరణాలు మారిపోయాయి. సృష్టి ఎలిమినేషన్‌కు దగ్గరగా ఉన్నట్లు కొన్ని ఓటింగ్ కథనాలు చెబుతున్నప్పటికీ, ఇతర తాజా ట్రెండ్స్‌లో కంటెస్టెంట్ల స్థానాలు మారుతున్నట్లు సమాచారం. దీంతో వీకెండ్ ఎపిసోడ్‌లోనే అసలు ఫలితం తేలనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!