

ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీకి మెక్సికోలోని ఎస్టాడియో అజ్టెకా స్టేడియం వేదికగా అంగరంగ వైభవంగా తెరలేచింది. మధ్యలో బంగారు వర్ణంలో మెరిసిన ప్రపంచకప్ ట్రోఫీ, మెక్సికో సంస్కృతిని ప్రతిబింబించే సాంస్కృతిక ప్రదర్శనలు, సంప్రదాయ వస్త్రధారణలో కళాకారుల విన్యాసాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ప్రముఖ కొలంబియా గాయని షకీరా, నైజీరియా స్టార్ బర్నా బాయ్ ప్రపంచకప్ అధికారిక గీతం ‘డాయ్ డాయ్’ను ఆలపించి సందడి చేశారు. అలాగే జే బాల్విన్ సహా పలువురు గాయకులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు.
టోర్నీలో భాగంగా కెనడా, అమెరికాలో కూడా ప్రత్యేక ఆరంభ వేడుకలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా, గ్రూప్-ఎలో దక్షిణ కొరియా తన తొలి మ్యాచ్‌లో చెకియాతో తలపడనుంది. క్వాలిఫయింగ్ దశలో అజేయంగా నిలిచిన కొరియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. స్టార్ ఆటగాడు సన్ హ్యూంగ్ మిన్ పై అందరి దృష్టి నిలిచింది. మరోవైపు, ప్రపంచకప్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు హైతీ జట్టు జెర్సీపై ముద్రించిన యుద్ధ చిత్రాన్ని తొలగించాలని ఫిఫా ఆదేశించడంతో ఆ దేశం జెర్సీలో మార్పులు చేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!