

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఫిఫా వరల్డ్ కప్ 2026 గురువారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభ వేడుకలు అద్భుతమైన కళాప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు, సాంస్కృతిక వైభవంతో అభిమానులను ఆకట్టుకున్నాయి. వందలాది మంది కళాకారులు మెక్సికో సంస్కృతి, సంప్రదాయాలను నృత్య రూపంలో అద్భుతంగా ఆవిష్కరించారు.
వేదిక మధ్యలో భారీ ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ ఆవిష్కరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మెక్సికన్ పాప్ బ్యాండ్ మనా, లాస్ ఏంజిల్స్ అజులెస్ గ్రూప్, కొలంబియన్ గాయకుడు జే బల్విన్ ప్రదర్శనలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. అనంతరం ప్రపంచ ప్రఖ్యాత పాప్ గాయని షకీరా, నైజీరియన్ గాయకుడు బర్నా బాయ్‌తో కలిసి అధికారిక గీతం ‘డాయి డాయి’ ఆలపించగా స్టేడియం హర్షధ్వానాలతో మార్మోగింది. మెక్సికో-దక్షిణాఫ్రికా మధ్య తొలి మ్యాచ్ ప్రారంభంతో ఫిఫా వరల్డ్ కప్ 2026కు అధికారికంగా తెరలేచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!