
జనరల్

పాకిస్థాన్ స్టార్ పేసర్ మహమ్మద్ అబ్బాస్ లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అద్భుత ప్రదర్శన చేశాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టి లార్డ్స్ హానర్స్ బోర్డులో చోటు సంపాదించాడు. 5/57 గణాంకాలతో ఇంగ్లండ్‌ను 208 పరుగులకు ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో లార్డ్స్‌లో ఐదు వికెట్ల ఘనత సాధించిన పాకిస్థాన్ బౌలర్ల జాబితాలో అబ్బాస్ ఎనిమిదో బౌలర్‌గా నిలిచాడు.
ఇంగ్లండ్‌పై టెస్టుల్లో అబ్బాస్‌కు ఇదే తొలి ఐదు వికెట్ల ప్రదర్శన కాగా, టెస్టు క్రికెట్‌లో ఇది అతడి ఎనిమిదో ఫైవ్ వికెట్ హాల్. అంతకుముందు ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనూ అబ్బాస్ నాలుగు వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ 208 పరుగులకు ఆలౌట్ కావడంతో పాకిస్థాన్ ముందు 389 పరుగుల లక్ష్యం నిలిచింది. అయితే లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ టాప్ ఆర్డర్ తడబడింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!