

టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ప్రచారం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఆయన బీజేపీలో చేరే అవకాశాలున్నాయంటూ వార్తలు వెలువడుతున్నాయి. ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, మైనారిటీ మోర్చా నాయకుడు కున్వర్ బాసిత్ అలీతో షమీ సమావేశమైనట్లు సమాచారం. ఈ భేటీతో ఆయన రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు మొదలయ్యాయి.
రానున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అమ్రోహా నియోజకవర్గం నుంచి షమీకి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అలాగే బీజేపీ మైనారిటీ మోర్చాలో జాతీయ స్థాయి బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌లో ఆయనకు ఉన్న గుర్తింపును పార్టీ ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే బీజేపీలో చేరిక, పార్టీ పదవి లేదా ఎన్నికల టికెట్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!