
షోస్

ఏఐ రంగంలో మెటా మరో కీలక ముందడుగు వేసింది. ‘మ్యూజ్’ పేరుతో కొత్త ఏఐ ఏజెంట్‌ను ఆవిష్కరించింది. ఇది కేవలం వినియోగదారుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాకుండా, ఈ-మెయిల్స్ పంపడం, టికెట్లు, హోటల్స్ బుకింగ్, చెల్లింపులు, షాపింగ్ వంటి పలు డిజిటల్ పనులను స్వయంప్రతిపత్తితో పూర్తి చేయగలదు.
యూజర్ డేటా భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేక వెబ్ మెషిన్, ప్రైవసీ కంట్రోల్స్‌తో మ్యూజ్‌ను రూపొందించినట్లు మెటా తెలిపింది. ప్రస్తుతం ఈ ఏఐ ఏజెంట్ అమెరికాలో ప్రత్యేక యాప్‌తో పాటు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. డిజిటల్ సేవలను మరింత సులభతరం చేయడమే దీని ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!