

ఆమోదం తెలిపింది. సెమీకండక్టర్, డిస్‌ప్లే ఫ్యాబ్ పాలసీ 4.0లో సవరణలు చేస్తూ రూపొందించిన ఈ కొత్త విధానం ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0కు అనుగుణంగా ఉండనుంది. ఇందులో భాగంగా సిలికాన్ ఫ్యాబ్‌ల ఏర్పాటుకు 80 శాతం వరకు పెట్టుబడి రాయితీలు కల్పించనున్నారు. ఐదేళ్లపాటు అమల్లో ఉండే ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలో సెమీకండక్టర్ తయారీ రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు భారీ పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
రాష్ట్రంలో 5 వేల ఎకరాల విస్తీర్ణంలో సెమీకండక్టర్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఈ పార్కులో మూడు కొత్త సంస్థలు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. పార్కులో క్లీన్‌రూమ్స్, టెస్టింగ్ ల్యాబ్‌లు, అల్ట్రా ప్యూర్ వాటర్ వంటి అత్యాధునిక సదుపాయాలను కల్పించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీకి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వనుంది. పెట్టుబడిదారులకు వేగంగా అనుమతులు మంజూరు చేసేందుకు సింగిల్ విండో విధానాన్ని అమలు చేయనున్నారు. సెమీకండక్టర్ రంగానికి అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించేందుకు AP-STCC శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!