

ప్రమాదాల్లో గాయపడిన వారు, అత్యవసర వైద్యం అవసరమైన రోగులను వేగంగా ఆస్పత్రులకు తరలించేందుకు యూబిఫ్లై టెక్నాలజీస్ (ఇప్లేన్ కంపెనీ), అపోలో హాస్పిటల్స్ అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యం ద్వారా అత్యవసర వైద్య సేవల్లో ఎలక్ట్రిక్ ఎయిర్ అంబులెన్స్‌లు, మెడికల్ డెలివరీ డ్రోన్లు వినియోగించనున్నారు.
ఈ ఒప్పందం కింద ఇప్లేన్ అభివృద్ధి చేసిన e200X ఎలక్ట్రిక్ ఎయిర్ అంబులెన్స్‌లు, అపోలో 1066 అంబులెన్స్ సేవలతో కలిసి పనిచేస్తాయి. అలాగే మందులు, వైద్య సామగ్రిని నిమిషాల్లో చేరవేసే డ్రోన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. దీంతో మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు కూడా అత్యవసర సమయంలో నాణ్యమైన వైద్యం త్వరగా అందుతుందని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో ఇప్లేన్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశాలను కూడా పరిశీలించనున్నట్లు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!