
టెక్నాలజీ

మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మార్కెట్‌లో ధాన్యం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. జై శ్రీరామ్ రకం ధాన్యం క్వింటాకు గరిష్ఠంగా రూ.5,016 ధర పలకగా, ఆర్‌ఎన్‌ఆర్ రకం ధాన్యానికి క్వింటాకు రూ.4,200 ధర నమోదైంది. ఎల్‌నినో ప్రభావంతో ధాన్యం ధరలు గణనీయంగా పెరిగినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ధరలు రైతులకు కొంత ఊరటనిచ్చే అవకాశం ఉంది.
ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ప్రకారం సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.2,461, దొడ్డురకం ధాన్యానికి రూ.2,441తో పాటు రూ.500 బోనస్ అందిస్తున్నారు. మార్కెట్‌లో ధాన్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో బియ్యం ధరలపైనా ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో జై శ్రీరామ్ బియ్యం ధర క్వింటాకు రూ.8,000 నుంచి రూ.9,000 వరకు పలుకుతున్నట్లు సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!