

ఢిల్లీలో జరిగే జీఎస్‌టీ మండలి సమావేశంలో పలు కీలక సంస్కరణలపై చర్చ జరగనుంది. జీఎస్‌టీ నమోదు, నిబంధనల అమలు ప్రక్రియను మరింత సులభతరం చేసే ప్రతిపాదనలను మండలి పరిశీలించనుంది. ముఖ్యంగా ఈ-కామర్స్ సంస్థల ద్వారా వస్తువులు విక్రయించే చిన్న వ్యాపారులకు నమోదు ప్రక్రియను సరళీకరించే అంశంపై చర్చించనున్నారు. ఈ మార్పు అమలైతే పలు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ ద్వారా వ్యాపారం చేసే చిన్న విక్రేతలకు నిబంధనల భారం తగ్గే అవకాశం ఉంది.
బ్యాంకులు, నామినేటెడ్ సంస్థలు దిగుమతి చేసుకునే బంగారం, వెండి, ప్లాటినంపై ప్రస్తుతం ఉన్న ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ మినహాయింపును తొలగించే ప్రతిపాదనను కూడా మండలి పరిశీలించే అవకాశం ఉంది. ఈ దిగుమతులను మూడు శాతం ఐజీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదించినట్లు సమాచారం. జీఎస్‌టీ ప్రక్రియలను సులభతరం చేయడంతోపాటు పన్ను నిబంధనల అమలులో స్పష్టత తీసుకురావడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదనలు ఉన్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!