
జనరల్

2026 బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్ హురున్ ఇండియా జాబితా ప్రకారం ముకేశ్ అంబానీ కుటుంబం దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపార కుటుంబంగా తన అగ్రస్థానాన్ని కొనసాగించింది. దేశీయ సంపదలో 8.5 శాతం తగ్గుదల నమోదైనప్పటికీ, అంబానీ కుటుంబ సంపద రూ.25.8 లక్షల కోట్లుగా నమోదైంది.
రూ.19.6 లక్షల కోట్ల సంపదతో గౌతమ్ అదానీ కుటుంబం రెండో స్థానంలో నిలిచింది. ఎయిర్టెల్ ప్రమోటర్ సునీల్ భారతీ మిట్టల్ కుటుంబం రూ.12.1 లక్షల కోట్లతో మూడో స్థానంలో ఉండగా, కుమార్ మంగళం బిర్లా కుటుంబం రూ.8.14 లక్షల కోట్లతో తర్వాతి స్థానంలో నిలిచింది. దేశంలోని టాప్-300 వ్యాపార కుటుంబాల వ్యాపారాల మొత్తం విలువ సుమారు రూ.138 లక్షల కోట్లుగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. గత రెండేళ్లలో ఈ కుటుంబాల వ్యాపారాల విలువ రోజుకు సగటున రూ.4,076 కోట్ల చొప్పున పెరిగినట్లు తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!