

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వంభర’ విడుదలకు సంబంధించి ఆసక్తికరమైన చర్చ మొదలైంది. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. మరోవైపు చిరంజీవి ప్రస్తుతం ‘కాకా’ పనులతో బిజీగా ఉన్నారు. ఈ రెండు చిత్రాలపైనా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి బరిలో నిలిచేందుకు రెండు సినిమాల నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘కాకా’ చిత్రాన్ని జనవరి 13న విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. అయితే ‘విశ్వంభర’ విడుదల తేదీపై మాత్రం ఇప్పటివరకు స్పష్టత రాలేదు.
తాజా సమాచారం ప్రకారం ‘విశ్వంభర’ను జనవరి మొదటి వారంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారట. అదే జరిగితే వారం రోజుల వ్యవధిలో చిరంజీవి నటించిన రెండు సినిమాలు థియేటర్లలో సందడి చేసే అవకాశం ఉంటుంది. గతంలో సీనియర్ హీరోలు తక్కువ వ్యవధిలో వరుసగా సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి విడుదలలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు 2027 సంక్రాంతికి అలాంటి ప్రత్యేకమైన పరిణామం చోటుచేసుకుంటుందా అనే ఆసక్తి నెలకొంది. రెండు చిత్రాల విడుదల తేదీలపై అధికారిక ప్రకటన వస్తేనే ఈ విషయంలో పూర్తి స్పష్టత రానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!