

‘అర్నబ్’ తుపాను (Cyclone Arnab)ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణనష్టం జరగకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. విపత్తు నిర్వహణకు సంబంధించిన అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, ఆపత్కాలంలో ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసు, అగ్నిమాపక, రెవెన్యూ శాఖల బృందాలు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. తీరప్రాంత ప్రజలను అవసరమైనప్పుడు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఆయా కేంద్రాల్లో స్వచ్ఛమైన తాగునీరు, ఆహారం, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ టోల్‌ఫ్రీ నంబర్లు 1070, 112ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!