

టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్ రెడ్డి నటుడిగా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం ‘మణికంద’ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. మలయాళంలో విజయవంతమైన మాళికాపురం చిత్రంతో గుర్తింపు పొందిన దర్శకుడు విష్ణు శశి శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుండగా, తంత్ర ఫిల్మ్స్ ప్రొడక్షన్స్, జేకే శరవనన్ రాజారామ్ ప్రజెంట్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అయ్యప్ప స్వామి భక్తి, ఆధ్యాత్మికత, మాస్ యాక్షన్ అంశాల కలయికతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది. తాజాగా మేకర్స్ విడుదల చేసిన వైభవ్ రెడ్డి ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. అయ్యప్ప స్వామి విగ్రహం నేపథ్యంలో మెడలో రుద్రాక్షలు ధరించి, చేతులకు కూడా వాటిని కట్టుకుని వైభవ్ పవర్‌ఫుల్ అవతార్‌లో కనిపిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో నవంబర్ లేదా డిసెంబర్‌లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమా వైభవ్ కెరీర్‌లో ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!