

నంద్యాల జిల్లాలో సీపీఐ జడ్పీటీసీ అభ్యర్థి భాస్కర్‌ను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. రుద్రవరం జడ్పీటీసీ స్థానానికి సీపీఐ అభ్యర్థిగా నామినేషన్ వేసిన భాస్కర్‌ను లక్ష్యంగా చేసుకుని టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి రాజారావు, కానిస్టేబుల్ ఓబులేశుతో కలిసి ఈ ప్రయత్నం చేసినట్లు సీపీఐ నేతలు ఆరోపించారు. రాత్రి 11 గంటల సమయంలో రాజారావు ఓ కానిస్టేబుల్‌ను వెంటబెట్టుకుని నంద్యాలలోని సీపీఐ కార్యాలయానికి వెళ్లినట్లు తెలిపారు.
ఎస్సై పిలుస్తున్నారని చెప్పి భాస్కర్‌ను కార్యాలయం బయటకు పిలిచి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని సీపీఐ నేతలు పేర్కొన్నారు. ఈ క్రమంలో సీపీఐ నాయకులను టీడీపీ నేతలు బెదిరించినట్లు ఆరోపించారు. పరిస్థితిని గమనించిన సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు, పార్టీ కార్యకర్తలు తిరగబడటంతో అక్కడ ఉద్రిక్తత నెలకొన్నట్లు సమాచారం. అనంతరం సీపీఐ నేతలు డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, పోలీసుల స్పందన తెలియాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!