
టెక్నాలజీ

ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీకి సంబంధించి సెర్ప్ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 30, డిసెంబర్ 1 తేదీల్లో లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 61.46 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.2,707.30 కోట్లను విడుదల చేసింది.
ఈ నెల 30న బ్యాంకుల నుంచి అవసరమైన నగదును విత్డ్రా చేసి అదే రోజు లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయాలని సెర్ప్ స్పష్టం చేసింది. మొదటి రోజు పంపిణీలో పెన్షన్లు అందని వారికి డిసెంబర్ 1న అందించాలని ఆదేశించింది. ఎన్నికల విధులకు సిబ్బంది హాజరుకావాల్సి ఉండటంతో పంపిణీని రెండు రోజుల పాటు చేపట్టాలని సెర్ప్ నిర్ణయించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!