

టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌కు చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో ఆయనకు ఏడాది సాధారణ జైలు శిక్ష విధించడంతో పాటు రూ.95 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బండ్ల గణేష్ ఇచ్చిన చెక్ నగదుగా మారకపోవడంతో బాధితుడు న్యాయం కోరుతూ ఒంగోలు కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై సుదీర్ఘ విచారణ కొనసాగింది.
కేసులో సమర్పించిన ఆధారాలను పరిశీలించిన అనంతరం బండ్ల గణేష్‌పై నేరం రుజువైనట్లు కోర్టు నిర్ధారించి ఏడాది సాధారణ జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా విధించింది. జరిమానాతో పాటు కేసు విచారణ కోసం బాధితుడు ఖర్చు చేసిన కోర్టు ఖర్చులను కూడా బండ్ల గణేష్ భరించాలని న్యాయమూర్తి ఆదేశించారు. గతంలోనూ ఆయనపై పలు చెక్ బౌన్స్ కేసులు నమోదవగా, కొన్ని కేసుల్లో కోర్టులు శిక్షలు విధించిన తర్వాత ఆయన అప్పీల్‌కు వెళ్లినట్లు సమాచారం. తాజాగా ఒంగోలు కోర్టు ఇచ్చిన తీర్పు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!