20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇందిరమ్మ ఇళ్ల లాటరీపై బిగ్ అప్డేట్

Writer: Pooja 11:02 PM, 19 ఆగస్టు, 2026
ఇందిరమ్మ ఇళ్ల లాటరీపై బిగ్ అప్డేట్

ఓఆర్‌ఆర్ పరిధిలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌లో ఇళ్ల కేటాయింపు కోసం ఈ నెల 27 నుంచి లాటరీ ప్రక్రియ ప్రారంభం కానుంది. హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ శ్రీ వి.పి. గౌతం తెలిపిన వివరాల ప్రకారం, ఆగస్టు 27 నుంచి 30 వరకు నాలుగు రోజుల పాటు ప్రతిరోజూ నాలుగు నియోజకవర్గాల చొప్పున లాటరీ నిర్వహించనున్నారు. ఓఆర్‌ఆర్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణ లక్ష్యంలో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,340 ఇళ్ల కోసం డిమాండ్ సర్వే ద్వారా దరఖాస్తులు స్వీకరించారు.

దరఖాస్తుల పరిశీలన ప్రస్తుతం కొనసాగుతోంది. హైదరాబాద్‌లో స్థిర నివాసం ఉందా, ఓఆర్‌ఆర్ పరిధిలో దరఖాస్తుదారులకు ప్లాట్ (Flat), ఫ్లాట్ (Plot) వంటి ఆస్తులు ఉన్నాయా తదితర వివరాలను పరిశీలించి తుది జాబితాను రూపొందిస్తున్నారు. దరఖాస్తుదారుల వివరాలను గురువారం సాయంత్రం నుంచి https://ts.meeseva.telangana.gov.in/, tghb.cgg.gov.in, tghb.telangana.gov.in వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నారు. వివరాలపై అభ్యంతరాలను ఈ నెల 23వ తేదీ సాయంత్రం వరకు తెలియజేయవచ్చు. అభ్యంతరాల పరిశీలన అనంతరం అర్హుల తుది జాబితాను ఈ నెల 25న ప్రకటించనున్నారు.

లాటరీ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు రెవెన్యూ, హౌసింగ్ బోర్డు అధికారులు, మీడియా సమక్షంలో ఏర్పాట్లు చేస్తున్నారు. యూట్యూబ్ తదితర మాధ్యమాల ద్వారా లాటరీని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు తదితర రిజర్వేషన్ల ప్రకారం డ్రా నిర్వహిస్తారు. ప్రతి కేటగిరీలో 20 శాతం వెయిటింగ్ లిస్ట్‌ను కూడా లాటరీ ద్వారానే ఎంపిక చేస్తారు. ఇళ్ల కేటాయింపుపై సందేహాలు ఉంటే 040 24603572 కాల్ సెంటర్ నంబర్‌ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రతి రైతుకూ సకాలంలో రుణం అందాలి - డిప్యూటీ సీఎం భట్టి

ప్రతి రైతుకూ సకాలంలో రుణం అందాలి - డిప్యూటీ సీఎం భట్టి

ఏపీపీఎస్సీ వ్యవహారంపై ఏబీ వెంకటేశ్వరరావు ఫైర్

ఏపీపీఎస్సీ వ్యవహారంపై ఏబీ వెంకటేశ్వరరావు ఫైర్

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ టికెట్లకు ధరలు పెంపు

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ టికెట్లకు ధరలు పెంపు

మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌పై కేసు నమోదు

మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌పై కేసు నమోదు

రేగా కాంతారావుకు హైకోర్టులో భారీ ఊరట

రేగా కాంతారావుకు హైకోర్టులో భారీ ఊరట

 నీట్-యూజీ  రీ-ఎగ్జామ్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం

నీట్-యూజీ రీ-ఎగ్జామ్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం

ట్యాగ్లు
ఇందిరమ్మ ఇళ్లుతెలంగాణ హౌసింగ్ఇళ్ల లాటరీఓఆర్ఆర్తెలంగాణ ప్రభుత్వంఇళ్ల కేటాయింపు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రతి రైతుకూ సకాలంలో రుణం అందాలి - డిప్యూటీ సీఎం భట్టి
జనరల్

ప్రతి రైతుకూ సకాలంలో రుణం అందాలి - డిప్యూటీ సీఎం భట్టి

సుష్మితపై అనిత జక్కని తీవ్ర విమర్శలు
రాజకీయాలు

సుష్మితపై అనిత జక్కని తీవ్ర విమర్శలు

ఏపీపీఎస్సీ వ్యవహారంపై ఏబీ వెంకటేశ్వరరావు ఫైర్
జనరల్

ఏపీపీఎస్సీ వ్యవహారంపై ఏబీ వెంకటేశ్వరరావు ఫైర్

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ టికెట్లకు ధరలు పెంపు
జనరల్

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ టికెట్లకు ధరలు పెంపు

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లిష్ ట్రైలర్ విడుదల
సినిమాలు

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లిష్ ట్రైలర్ విడుదల

ఇందిరమ్మ ఇళ్ల లాటరీపై బిగ్ అప్డేట్
జనరల్

ఇందిరమ్మ ఇళ్ల లాటరీపై బిగ్ అప్డేట్

అక్కినేని ఫ్యామిలీ లెగసీపై నాగ్‌ ఆసక్తికర కామెంట్స్
సినిమాలు

అక్కినేని ఫ్యామిలీ లెగసీపై నాగ్‌ ఆసక్తికర కామెంట్స్

మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌పై కేసు నమోదు
జనరల్

మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌పై కేసు నమోదు

రజినీకాంత్ ‘ధర్మన్’లో రామ్ పోతినేని?
గాసిప్స్

రజినీకాంత్ ‘ధర్మన్’లో రామ్ పోతినేని?

రేగా కాంతారావుకు హైకోర్టులో భారీ ఊరట
జనరల్

రేగా కాంతారావుకు హైకోర్టులో భారీ ఊరట

 నీట్-యూజీ  రీ-ఎగ్జామ్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
జనరల్

నీట్-యూజీ రీ-ఎగ్జామ్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం

గుజరాత్‌కే ప్రాజెక్టులా? అన్నామలై కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

గుజరాత్‌కే ప్రాజెక్టులా? అన్నామలై కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!