
జనరల్

బెంగళూరులోని ఓ పబ్‌లో ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ గొడవకు సంబంధించిన వ్యవహారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి చేరింది. ఈ ఘటనకు సంబంధించి బెంగళూరులో ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినట్లు సమాచారం. వికాస్ మర్మత్ ప్రస్తుతం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి స్పెషల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే గొడవకు దారితీసిన పరిస్థితులు, ఎఫ్‌ఐఆర్‌లోని వివరాలపై మరింత సమాచారం అందాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!