
టెక్నాలజీ

మంగళగిరి ఎయిమ్స్ క్యాంటీన్‌లో మంగళవారం మధ్యాహ్నం భోజనం విషయంలో తీవ్ర వివాదం చోటుచేసుకుంది. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఓ మహిళ భోజన సమయంలో నాలుగోసారి కూర అడగడంతో క్యాంటీన్ సిబ్బందితో వాగ్వాదం మొదలైంది. ఓపీడీ, ఐపీడీ బ్లాకుల మధ్య ఉన్న క్యాంటీన్‌లో ఈ ఘటన జరిగింది.
వివాదం తీవ్రతరమవడంతో ఆమె సిబ్బందిపై దుర్భాషలాడుతూ నీటి సీసాలు, చెప్పును విసిరినట్లు CCTVలో రికార్డైంది. ఆమెతో ఉన్న మరో వ్యక్తి కూడా పాత్రను నేలకేసి కొట్టినట్లు సమాచారం. సిబ్బంది కూడా ప్రతిస్పందించడంతో ఉద్రిక్తత పెరిగింది. అనంతరం సెక్యూరిటీ సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరుపక్షాలు ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదులు అందజేయగా, విషయాన్ని ఎయిమ్స్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!