
ఓటీటీ

హైదరాబాద్‌లో భారీ జీఎస్టీ ఎగవేత కేసు వెలుగులోకి రావడంతో ఎకోరెన్ ఎనర్జీ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ ప్రసాద్ యెర్నేనిని జీఎస్టీ అధికారులు అరెస్ట్ చేశారు. నకిలీ ఇన్‌వాయిస్‌లను ఉపయోగించి రూ.64.5 కోట్ల ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC)ను అక్రమంగా క్లెయిమ్ చేసినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ కేసు ఆర్థిక అక్రమాల దర్యాప్తులో కీలక మలుపుగా మారింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పునరుత్పాదక ఇంధన రంగంలో భారీ పెట్టుబడులు పెట్టిన ఎకోరెన్ ఎనర్జీపై జీఎస్టీ అధికారులు సుదీర్ఘంగా దర్యాప్తు నిర్వహిస్తున్నారు. నకిలీ పత్రాల ద్వారా అక్రమ పన్ను ప్రయోజనాలు పొందినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరిన్ని వ్యక్తులు లేదా సంస్థల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!