

కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి 2026 జూలై 26న కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ప్రజా ప్రతినిధులు, దక్షిణ మధ్య రైల్వే అధికారులు హాజరయ్యారు. కార్యక్రమానికి ముందు కార్గిల్ వీరులకు రెండు నిమిషాల మౌనం పాటించారు. సుమారు ₹6 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ స్టేషన్, కొమురవెల్లి మల్లన్న ఆలయానికి వచ్చే భక్తులకు కీలక అనుసంధానంగా మారనుంది.
ముందుగా సిద్దిపేట–సికింద్రాబాద్ డీఈఎంయూ రైలును ప్రారంభిస్తూ ఈ స్టేషన్ ప్రాంతీయ రవాణా అభివృద్ధికి దోహదం చేస్తుందని నేతలు తెలిపారు. తెలంగాణకు 2026-27 రైల్వే బడ్జెట్‌లో ₹5,454 కోట్లు కేటాయించినట్లు బండి సంజయ్ వెల్లడించారు. కొత్త లైన్లు, డబ్లింగ్, హై స్పీడ్ రైల్ ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తాయని అన్నారు. అదనపు ప్లాట్‌ఫారమ్‌లు, షటిల్ బస్సు సేవలు ఏర్పాటు చేయాలని కిషన్ రెడ్డి సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!