
సినిమాలు

హైదరాబాద్‌లో బాల్యవివాహం ఘటన కలకలం రేపింది. పదిహేడేళ్ల బాలికను వివాహం చేసుకునేందుకు 42 ఏళ్ల అరబ్ షేక్ ఈ నెల 2న సౌదీ అరేబియా నుంచి వచ్చినట్లు సమాచారం. అర్ధరాత్రి సమయంలో దళారుల సహకారంతో వివాహానికి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై అంగన్‌వాడీ టీచర్ ఫిర్యాదు చేయడంతో ఈ నెల 3న పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫిర్యాదుపై స్పందించిన రాజేంద్రనగర్ పోలీసులు బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి అరబ్ షేక్‌తో పాటు దళారులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మైనర్ బాలికకు వివాహం జరిపేందుకు ప్రయత్నించినట్లు వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, తదుపరి చర్యలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!