
రాజకీయాలు

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ సినీ రంగానికి సింగీతం శ్రీనివాసరావు అందించిన సేవలు చిరస్మరణీయమని సీఎం పేర్కొన్నారు. తనదైన శైలిలో ఎన్నో విలక్షణ చిత్రాలను తెరకెక్కించి సినీ రంగంపై ఆయన చెరగని ముద్ర వేశారని తెలిపారు.
సింగీతం శ్రీనివాసరావు మృతి భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటని రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దర్శకుడిగా, సృజనాత్మక ప్రతిభావంతుడిగా సింగీతం అందించిన సేవలను సినీ రంగం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!