

ముంబైలోని జేఎండబ్ల్యూ మారియట్ సహార్‌లోని రొమానో రెస్టారెంట్‌లో ప్రముఖ కార్డియాలజిస్ట్, ఫోర్టిస్ హెల్త్‌కేర్ చైర్మన్ డాక్టర్ అశోక్ సేత్‌కు అనూహ్య అనుభవం ఎదురైంది. శనివారం రాత్రి భోజనం చేస్తుండగా ఆయన టేబుల్‌పై ఓ చిన్న బొద్దింక కనిపించింది. దానికి ‘రోచీ’ అంటూ సరదాగా పేరు పెట్టిన డాక్టర్ సేత్, అది వెళ్లకపోవడంతో చివరకు భోజనం పూర్తి చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై ఆయన ఆహార పరిశుభ్రత, నాణ్యతపై ఆందోళన వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఐదు నక్షత్రాల హోటల్‌లోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంపై ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాలపై చర్చ మొదలైంది. డాక్టర్ సేత్ మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన కమిషనర్ తుకారాం ముండే, భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థను ట్యాగ్ చేశారు. ఈ ఘటనపై మారియట్ బాన్‌వాయ్ అసిస్ట్ స్పందిస్తూ, ఫిర్యాదును తీవ్రంగా పరిగణిస్తున్నామని, వివరాలను పరిశీలిస్తామని తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!