

హైదరాబాద్‌కు వచ్చిన ప్రతిసారీ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. ఆర్‌ఆర్ ట్యాక్స్ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ అంశంపై పదేపదే ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేతలు ఇప్పటివరకు ఎందుకు చర్యలు చేపట్టలేదని ఆయన ప్రశ్నించారు.
హైదరాబాద్‌లోని బిల్డర్లు, డెవలపర్లను అడిగినా ఆర్‌ఆర్ ట్యాక్స్ గురించి చెబుతారని కేటీఆర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆర్‌ఆర్ ట్యాక్స్ పేరుతో బిల్డర్ల నుంచి చదరపు అడుగుకు రూ.200 వసూలు చేస్తున్నారనేది వాస్తవమని ఆయన ఆరోపించారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసని అన్నారు. బీజేపీ నేతలవి కేవలం మాటలేనని, చేతల్లో మాత్రం ఎలాంటి చర్యలు ఉండవని ఎద్దేవా చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!