30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాశిఫలాలు: నేడు 12 రాశుల వారికి ఎలా ఉంది?

Writer: Chandrika 05:28 AM, 30 ఆగస్టు, 2026
రాశిఫలాలు: నేడు 12 రాశుల వారికి ఎలా ఉంది?

1. మేషం :

మనోబలంతో కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆలోచనల్లో స్థిరత్వం చాలా ముఖ్యం. కీలక బాధ్యతలను వ్యక్తిగతంగా పర్యవేక్షించండి. వ్యాపార నిర్ణయాల్లో అజాగ్రత్తకు తావివ్వకండి. శుక్రబలం కొంత తక్కువగా ఉండటంతో ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. హనుమంతుడిని అర్చించండి.

2. వృషభం :

అదృష్టం కలిసివస్తుంది. బలమైన ప్రయత్నాలు అత్యుత్తమ ఫలితాలను అందిస్తాయి. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. చంద్రబలం మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది. శని పట్టుదలను ప్రసాదిస్తాడు. బుధుడి అనుగ్రహంతో ఆలోచనల్లో వేగం పెరుగుతుంది. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మహాలక్ష్మిని ధ్యానించండి.

3. మిథునం:

శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. గ్రహబలం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ఆలోచనలకు నిర్దిష్టమైన రూపాన్ని ఇస్తారు. రవి అనుకూలతతో వృత్తి, ఉద్యోగాల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తారు. శుక్రబలం ఆర్థిక విజయాలను అందిస్తుంది. కొత్త సంపాదన మార్గాలు కనిపిస్తాయి. అదృష్టానికి మానవ ప్రయత్నం తోడుకావాలి. లక్ష్మీదేవిని పూజించండి.

4. కర్కాటకం :

లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంది. విజయం సాధించే వరకు ప్రయత్నాలను ఆపకండి. గ్రహబలం కొంత తక్కువగా ఉన్నప్పటికీ మనోబలంతో ఆ పరిమితిని అధిగమిస్తారు. బుధుడు ఉన్నతమైన ఆలోచనలను ప్రసాదిస్తాడు. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. శుక్రుడి అనుగ్రహంతో ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. నవగ్రహ ధ్యాన శ్లోకాలను పఠించండి.

5. సింహం :

స్పష్టమైన లక్ష్యాలతో కొత్త పనులను ప్రారంభించండి. ధర్మాన్ని విడిచిపెట్టకండి. శుక్రబలం సంపదను వృద్ధి చేస్తుంది. ఆదాయ మార్గాలను విస్తరించుకుంటారు. ఆలోచనలకే పరిమితం కాకుండా ఆచరణకు కూడా ప్రాధాన్యం ఇవ్వండి. గత అనుభవాల ఆధారంగా ముఖ్య నిర్ణయాలు తీసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి.

6. కన్య :

అనేక విజయాలను సాధిస్తారు. అదృష్టయోగం ఉంది. లక్ష్యంపైనే దృష్టి కేంద్రీకరించండి. ఆలోచనలు పక్కదారి పట్టకుండా జాగ్రత్తపడండి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం ప్రయోజనకరం. శుక్రుడు సంపదను వృద్ధి చేస్తాడు. అదనపు ఆదాయాన్ని పొదుపు, మదుపు దిశగా మళ్లించండి. వృత్తి, ఉద్యోగాల్లో సమయస్ఫూర్తి అవసరం. మహాలక్ష్మిని ధ్యానించండి.

7. తుల :

గ్రహాల అనుకూలత ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభను ప్రదర్శిస్తారు. చిన్నపాటి ప్రయత్నంతో వ్యాపార విజయాలను సాధించే అవకాశం ఉంది. బుధుడు ప్రణాళికల రూపకల్పనలో సహాయపడతాడు. దీర్ఘకాలిక లక్ష్యాల వైపు అడుగులు వేస్తారు. మీ పనితీరును పెద్దలు ప్రశంసిస్తారు. ప్రయత్నానికి రెట్టింపు ఫలితాలు లభించే సూచనలు ఉన్నాయి. లక్ష్మీనారాయణులను ధ్యానించండి.

8. వృశ్చికం :

గ్రహాల అనుగ్రహం ఉంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. మీ ప్రతిభను నలుగురూ గుర్తిస్తారు. గురువు జ్ఞానం, వివేకాన్ని ప్రసాదిస్తాడు. శుక్రబలం ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది. అయితే బుధబలం కొంత తక్కువగా ఉండటంతో వ్యాపార సమావేశాల్లో తెలివిగా వ్యవహరించాలి. శ్రీవేంకటేశ్వరుడిని స్మరించండి.

9. ధనుస్సు :

లక్ష్య సాధనలో ఏకాగ్రత అవసరం. అనుకున్న పనులన్నీ వేగంగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. గ్రహబలంలోని పరిమితులను ఆత్మశక్తితో అధిగమిస్తారు. ఒకేసారి అనేక పనులను నెత్తిన వేసుకోకండి. వ్యాపారంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో సమయపాలన పాటించండి. నవగ్రహాలను ధ్యానించండి.

10. మకరం :

విజయాలు సూచిస్తున్నాయి. ఆలోచనల్లో స్థిరత్వం అవసరం. గురుబలం ఉత్తమ నిర్ణయాలకు తోడ్పడుతుంది. ఏదో ఒక రూపంలో అదృష్టం వరిస్తుంది. శుక్రుడు సంపదను ప్రసాదిస్తాడు. రాబడులను పొదుపు, మదుపు దిశగా మళ్లించండి. వ్యాపార వ్యవహారాల్లో నిర్లిప్తత నష్టదాయకం. క్రమశిక్షణ విషయంలో రాజీపడకండి. శ్రీలక్ష్మిని అర్చించండి.

11. కుంభం :

అనుకున్నది సాధిస్తారు. కొన్ని ప్రయత్నాలు ఆలస్యంగా ఫలించవచ్చు. చిన్నపాటి అవరోధాలకే నిరాశ చెందకండి. ఆత్మీయుల సహాయసహకారాలు అందుతాయి. అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులను సద్వినియోగం చేసుకోండి. గ్రహబలం కొంత తక్కువగా ఉన్నా ఆత్మవిశ్వాసంతో ఆ పరిమితిని అధిగమించవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. నవగ్రహాలను ధ్యానించండి.

12. మీనం :

అదృష్టయోగం ఉంది. కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో మిమ్మల్ని మీరు నిరూపించుకుంటారు. గ్రహాల అనుకూలత అపారంగా ఉంది. వ్యాపారంలో ఉత్తమ ఫలితాలను సాధించే అవకాశాలు ఉన్నాయి. వ్యయాలను నియంత్రించండి. ఆలోచనల్లో అస్పష్టత మంచిది కాదు. కొత్త బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. శ్రీమహావిష్ణువును ధ్యానించండి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌కు సమీపంలో అద్భుత శివక్షేత్రం..

హైదరాబాద్‌కు సమీపంలో అద్భుత శివక్షేత్రం..

రాఘవేంద్ర స్వామి సజీవ బృందావనం.. మంత్రాలయం మహిమకు ఇదే నిదర్శనం!

రాఘవేంద్ర స్వామి సజీవ బృందావనం.. మంత్రాలయం మహిమకు ఇదే నిదర్శనం!

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. జపాన్‌ కంపెనీలకు మంత్రి వివేక్‌ పిలుపు

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. జపాన్‌ కంపెనీలకు మంత్రి వివేక్‌ పిలుపు

సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ 2026 ఫలితాలు విడుదల

సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ 2026 ఫలితాలు విడుదల

వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు

వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు

నీట్‌-పీజీ అభ్యర్థులకు అలర్ట్‌.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

నీట్‌-పీజీ అభ్యర్థులకు అలర్ట్‌.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

ట్యాగ్లు
దినఫలాలురాశిఫలాలునేటి రాశిఫలాలుజ్యోతిష్యంరాశులుమేషంవృషభంమిథునంకర్కాటకంసింహంకన్యతులవృశ్చికంధనుస్సుమకరంకుంభంమీనం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ గడువు పెంచాలి.. సీఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
జనరల్

తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ గడువు పెంచాలి.. సీఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

నేటి నుంచి భారత మహిళల టీ20 ఆసియాకప్‌ పోరాటం...
క్రీడలు

నేటి నుంచి భారత మహిళల టీ20 ఆసియాకప్‌ పోరాటం...

సజ్జలపై విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు..
రాజకీయాలు

సజ్జలపై విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు..

హైదరాబాద్‌కు సమీపంలో అద్భుత శివక్షేత్రం..
జనరల్

హైదరాబాద్‌కు సమీపంలో అద్భుత శివక్షేత్రం..

రాఘవేంద్ర స్వామి సజీవ బృందావనం.. మంత్రాలయం మహిమకు ఇదే నిదర్శనం!
జనరల్

రాఘవేంద్ర స్వామి సజీవ బృందావనం.. మంత్రాలయం మహిమకు ఇదే నిదర్శనం!

రాశిఫలాలు: నేడు 12 రాశుల వారికి ఎలా ఉంది?
జనరల్

రాశిఫలాలు: నేడు 12 రాశుల వారికి ఎలా ఉంది?

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. జపాన్‌ కంపెనీలకు మంత్రి వివేక్‌ పిలుపు
జనరల్

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. జపాన్‌ కంపెనీలకు మంత్రి వివేక్‌ పిలుపు

సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ 2026 ఫలితాలు విడుదల
జనరల్

సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ 2026 ఫలితాలు విడుదల

ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది - సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది - సీఎం రేవంత్‌రెడ్డి

వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు
జనరల్

వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు

నీట్‌-పీజీ అభ్యర్థులకు అలర్ట్‌.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు
జనరల్

నీట్‌-పీజీ అభ్యర్థులకు అలర్ట్‌.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

ఏపీలో విజయ డెయిరీ పాల సేకరణ ధర పెంపు
జనరల్

ఏపీలో విజయ డెయిరీ పాల సేకరణ ధర పెంపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!