
రాజకీయాలు

ప్రధాని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో మాదకద్రవ్యాల వ్యసనంపై కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ వ్యసనం యువత ఆశయాలకు, భవిష్యత్తుకు పెను సవాల్‌గా మారుతోందని అన్నారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వ్యసనం నుంచి బయటపడిన ఓ యువకుడితో మాట్లాడి, అతడి అనుభవాలను తెలుసుకున్నారు. యువతను ఈ వ్యసనం నుంచి దూరంగా ఉంచాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.
దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రజల భాగస్వామ్యం క్రమంగా పెరుగుతోందని మోదీ పేర్కొన్నారు. నషా ముక్త్ యువ అభియాన్ కార్యక్రమం కూడా విస్తృతంగా కొనసాగుతోందని తెలిపారు. డ్రగ్స్ వ్యసనాన్ని అరికట్టేందుకు ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సమిష్టిగా కృషి చేయాలని ఆయన సందేశమిచ్చారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!