19, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రకృతి వైపరీత్యాలకు 30 ఏళ్లలో 9 లక్షల మంది బలి..

Writer: Chandrika 03:45 PM, 18 నవంబర్, 2026
ప్రకృతి వైపరీత్యాలకు 30 ఏళ్లలో 9 లక్షల మంది బలి..

ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు తీవ్ర ప్రాణ, ఆర్థిక నష్టాలను మిగులుస్తున్నాయని జర్మనీకి చెందిన పర్యావరణ సంస్థ విడుదల చేసిన ‘క్లైమేట్ రిస్క్ ఇండెక్స్‌-2027’ నివేదిక వెల్లడించింది. తుర్కియేలో జరుగుతున్న కాప్‌31 వాతావరణ సదస్సు సందర్భంగా విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. 1996 నుంచి 2025 వరకు గడిచిన 30 ఏళ్లలో తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 550 కోట్ల మంది ప్రభావితమవగా, ప్రపంచ దేశాలకు 4.7 ట్రిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక నష్టం వాటిల్లింది. ఈ కాలంలో వడగాలులు, ఉష్ణమండల తుపానులు, భారీ వర్షాలు, వరదలు సహా దాదాపు 10 వేల వాతావరణ విపత్తులు సంభవించాయి. అత్యధికంగా ప్రభావితమైన దేశాల జాబితాలో భారత్ 10వ స్థానంలో నిలిచింది. దేశంలో ఈ విపత్తుల కారణంగా సుమారు 78 వేల మంది మరణించినట్లు నివేదిక పేర్కొంది. దీర్ఘకాలిక వాతావరణ ముప్పును ఎదుర్కొన్న దేశాల్లో డొమినికా మొదటి స్థానంలో ఉండగా, మయన్మార్, హోండురాస్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ముఖ్యంగా పేద దేశాలపై ప్రకృతి వైపరీత్యాల ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

2025లో సంభవించిన వాతావరణ విపత్తుల కారణంగా జమైకా, శ్రీలంక, స్పెయిన్ అత్యంత తీవ్రంగా ప్రభావితమైనట్లు నివేదిక పేర్కొంది. ఆ తర్వాత థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, పాకిస్థాన్ ఉన్నాయి. జమైకాలో కేటగిరీ-5 హరికేన్ మెలిస్సా కారణంగా 62 మంది మరణించగా, ఆ దేశ వార్షిక జీడీపీలో దాదాపు సగానికి సమానమైన ఆర్థిక నష్టం వాటిల్లింది. శ్రీలంకలో దిత్వా తుపాను కారణంగా 823 మంది ప్రాణాలు కోల్పోగా, 17 లక్షల మందికి పైగా ప్రభావితమయ్యారు. స్పెయిన్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత మూడు దశాబ్దాల్లో వడగాలుల కారణంగానే అత్యధిక మరణాలు సంభవించగా, తుపానుల వల్ల భారీ ఆర్థిక నష్టాలు నమోదయ్యాయి. ఒక్క 2025లోనే ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా సుమారు 35 వేల మంది మరణించినట్లు నివేదిక వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి విపత్తుల ప్రభావాన్ని తగ్గించేందుకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, వరద నియంత్రణ చర్యలు, వాతావరణ మార్పులకు అనుగుణమైన ప్రణాళికల్లో పెట్టుబడులు పెంచాలని సూచించింది. అలాగే కర్బన ఉద్గారాలను వేగంగా తగ్గించడంతో పాటు వాతావరణ ముప్పును ఎదుర్కొంటున్న పేద దేశాలకు ఆర్థిక సహాయాన్ని పెంచాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా

సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకీ రచ్చ? విమర్శకులపై రుచి కొక్చా సెటైర్లు

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకీ రచ్చ? విమర్శకులపై రుచి కొక్చా సెటైర్లు

సౌదీ అరేబియాలోని నాలుగు నగరాలకు ఇండిగో విమానాలు రద్దు

సౌదీ అరేబియాలోని నాలుగు నగరాలకు ఇండిగో విమానాలు రద్దు

ట్యాగ్లు
వాతావరణ మార్పులుప్రకృతి వైపరీత్యాలుక్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2027గ్లోబల్ వార్మింగ్భారత్ వాతావరణ ముప్పుకాప్ 31 సదస్సువడగాలులువరదలుతుపానులుపర్యావరణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కావ్య కోసం పాట పాడిన అనిరుధ్‌.. వైరల్‌గా మారిన పెళ్లి ఫొటోలు
సినిమాలు

కావ్య కోసం పాట పాడిన అనిరుధ్‌.. వైరల్‌గా మారిన పెళ్లి ఫొటోలు

సత్యసాయి సందేశాలపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

సత్యసాయి సందేశాలపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు

సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా
జనరల్

సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా
గాసిప్స్

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...
టెక్నాలజీ

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన
సినిమాలు

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు
రాజకీయాలు

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు
జనరల్

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి
సినిమాలు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన
జనరల్

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..
రాజకీయాలు

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం
జనరల్

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!