

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐదుగురు అదనపు న్యాయమూర్తులు శాశ్వత న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ కుంచం మహేశ్వరరావు, జస్టిస్ తూట చంద్ర ధనశేఖర్ (టీసీడీ శేఖర్), జస్టిస్ చల్లా గుణరంజన్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ, జస్టిస్ డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని ఏపీ హైకోర్టు మొదటి కోర్టు హాల్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ వారితో ప్రమాణం చేయించారు.
ఐదుగురు న్యాయమూర్తుల శాశ్వత నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపిన అనంతరం కేంద్ర న్యాయశాఖ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. హైకోర్టులోని ఇతర న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు, హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు, న్యాయాధికారులు, రిజిస్ట్రార్లు, న్యాయశాఖ అధికారులు, న్యాయవాదులు కార్యక్రమానికి హాజరై నూతన శాశ్వత న్యాయమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!