
జనరల్

15 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా నిషేధం విధించాలన్న ఫ్రాన్స్ ప్రభుత్వ ప్రతిపాదనకు రాజ్యాంగపరమైన ఎదురుదెబ్బ తగిలింది. ఈ చట్టం భావప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించే అవకాశం ఉందని ఫ్రాన్స్ రాజ్యాంగ మండలి పేర్కొంది. అంతేకాకుండా వినియోగదారుల వయసును నిర్ధారించే విధానం పెద్దలకు కూడా ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని అభిప్రాయపడుతూ ప్రతిపాదిత చట్టాన్ని కొట్టివేసింది.
అయితే పిల్లల ఆన్‌లైన్ భద్రత విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గబోదని స్పష్టం చేసింది. రాజ్యాంగ మండలి సూచనలకు అనుగుణంగా కొత్త చట్ట ముసాయిదాను రూపొందించాలని ప్రధానిని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆదేశించారు. పిల్లలను ఆన్‌లైన్ ప్రమాదాల నుంచి రక్షించడంతో పాటు రాజ్యాంగపరమైన హక్కులకు భంగం కలగకుండా కొత్త చట్టాన్ని రూపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!