
సినిమాలు

తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శకుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఘన నివాళులు అర్పించారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచిన జయశంకర్ . జీవితాంతం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పనిచేశారని కొనియాడారు.
భవిష్యత్ తరాలకు జయశంకర్ స్ఫూర్తిని అందించేందుకు ఆయన జీవిత విశేషాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని హరీశ్ రావు తెలిపారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం, భూపాలపల్లి జిల్లాకు ఆయన పేరు పెట్టడంతో పాటు, ప్రతి ఏడాది జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. జయశంకర్ ఆశయాలను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!