
రాజకీయాలు

తెలంగాణ ప్రభుత్వం పచ్చి గుడ్లతో తయారుచేసే మయోనైజ్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్పత్తి తయారీ, విక్రయాలు, నిల్వలపై ఏడాది పాటు నిషేధం విధించింది. అక్టోబర్ 30 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
పచ్చి గుడ్లతో తయారుచేసే మయోనైజ్‌లో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉండే ప్రమాదం ఉందని, దీని కారణంగా ఆహార కలుషిత ఘటనలు, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం నిషేధం విధించింది. నిబంధనలను ఉల్లంఘించి మయోనైజ్‌ను తయారుచేసినా, విక్రయించినా లేదా నిల్వ చేసినా సంబంధిత వ్యాపారులపై జరిమానాలు విధించడంతో పాటు లైసెన్సులు రద్దు చేసే అవకాశం ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!