
జనరల్

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులకు సుమారు 18 గంటల సమయం పడుతోంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లు సర్వదర్శనం భక్తులతో నిండిపోయాయి. దీంతో క్యూలైన్ పాచికాల్వ గంగమ్మ ఆలయ సర్కిల్ వరకు విస్తరించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోని ఆరు కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచి ఉన్నారు.
బుధవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.12 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గురువారం మొత్తం 78,026 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 31,166 మంది తలనీలాలు సమర్పించారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో దర్శనానికి నిరీక్షణ సమయం పెరిగింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!