

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లో వర్షం కురవడంతో నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో కొన్ని కాలనీల్లో రోడ్లపైకి వర్షపు నీరు చేరి ప్రవహించింది. ఇటీవల కాలంలో సరైన వర్షాలు లేకపోవడంతో నగరంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. మరోవైపు తాగునీటి కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజా వర్షం నగరవాసులకు కొంత ఊరటనిచ్చింది.
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నెల్లూరు, కర్నూలు, కడప, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!