
సినిమాలు

హైదరాబాద్‌లో ప్రజా రవాణాను మరింత మెరుగుపరిచేందుకు పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (PRTS) అమలుపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సమీక్ష నిర్వహించి, సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. తొలిదశలో సుమారు 35 కిలోమీటర్ల మేర కారిడార్‌ను అభివృద్ధి చేసే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి.
ప్రతిపాదిత మార్గం కూకట్‌పల్లి నుంచి రాయదుర్గం, బయోడైవర్సిటీ మీదుగా నాలెడ్జ్ సిటీ వరకు ఉండనుంది. ఈ కారిడార్‌లో మొత్తం 64 స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. నగరంలో ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరచడం, ముఖ్యంగా ఐటీ కారిడార్ ప్రాంతాల్లో రవాణా అనుసంధానాన్ని పెంచడం ఈ ప్రాజెక్టు లక్ష్యంగా భావిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!