
జనరల్

హైదరాబాద్‌కు చెందిన రాజరాజేశ్వరి రాగంపూడి ఆర్కిటెక్చర్‌ను అభ్యసించిన తర్వాత హాలీవుడ్‌లో ప్రొడక్షన్ డిజైనర్‌గా కెరీర్‌ను నిర్మించుకున్నారు. సినీ నేపథ్యం లేకపోవడం, అనారోగ్యం, కరోనా వంటి ఎన్నో అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించి అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నత విద్య పూర్తి చేసి తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.
ఇప్పటివరకు 15కుపైగా అంతర్జాతీయ లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలు, మ్యూజిక్ ఆల్బమ్‌లు, వాణిజ్య ప్రకటనలకు ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేశారు. తాజాగా ప్రతిష్ఠాత్మక ‘వుమెన్ ఇన్ ఫిల్మ్ ఫెలోషిప్’కు ఎంపిక కావడం ఆమె ప్రయాణంలో మరో మైలురాయిగా నిలిచింది. ఒక రోజు ఆస్కార్ గెలిచి ప్రపంచ స్థాయిలో భారతీయ మహిళల ప్రతిభను నిరూపించాలన్నదే తన జీవిత లక్ష్యమని ఆమె చెబుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!