
రాజకీయాలు

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ గట్టిగా తమ వాదనలు వినిపించారు. ప్రతిపాదిత డీలిమిటేషన్‌పై రేవంత్‌రెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేయగా, ఈ అంశంపై డీఎంకే నేతలకు మమతా బెనర్జీ కీలక సూచనలు చేసినట్లు సమాచారం.
డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. సుమారు గంటా 15 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యంపై పడే ప్రభావం, వాటి ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరంపై చర్చ జరిగినట్లు సమాచారం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!