
రాజకీయాలు

డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీకి చెన్నైలో సాదర స్వాగతం పలికారు. 2018 తర్వాత సోనియా గాంధీ చెన్నైలో పర్యటించడం ఇది మూడోసారి. ఈ పర్యటన రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో 2018 డిసెంబర్‌లో అన్నా అరివాలయంలో దివంగత కలైజ్ఞర్ కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సోనియా గాంధీ చెన్నైకి వచ్చారు. అనంతరం 2023 అక్టోబర్‌లో డీఎంకే నిర్వహించిన మహిళా హక్కుల సదస్సులో పాల్గొనేందుకు ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి నగరాన్ని సందర్శించారు. ఈ సదస్సు వైఎంసీఏ మైదానంలో జరిగింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!