
సినిమాలు

తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టనుంది. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల వరకు ఉచిత జీవిత బీమా సౌకర్యం కల్పించే ‘ఇందిరమ్మ ఫ్యామిలీ ఇన్సూరెన్స్’ పథకాన్ని నవంబర్ 19న ప్రారంభించనుంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే అమలులో ఉన్న వివిధ బీమా పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి, కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఈ పథకం అమలుతో అర్హులైన కుటుంబాలకు బీమా రక్షణ అందనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!