
సినిమాలు

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమన్వయం, పర్యవేక్షణకు కొత్త కమిటీలను ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు జనసేన పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
గతంలో నియమించిన సమన్వయకర్తలు, ముగ్గురు సభ్యులతో కూడిన సమన్వయ కమిటీలు, వాటికి అనుబంధంగా ఉన్న సహాయక బృందాలు ఇకపై చెల్లుబాటు కావని పార్టీ తెలిపింది. 25 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన పార్లమెంటు నియోజకవర్గాల కమిటీలను రద్దు చేసినట్లు పేర్కొంది. అయితే, ఇటీవల స్థానిక ఎన్నికల కోసం రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల సమన్వయ కమిటీ, ప్రచార కమిటీలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. కొత్త కమిటీలను పవన్ కళ్యాణ్ త్వరలో నియమించనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!