31, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వరదల్లో చిక్కుకున్న నేపాల్‌కు అండగా కే-పాప్‌ స్టార్‌..

Writer: Chandrika 10:31 PM, 31 ఆగస్టు, 2026
వరదల్లో చిక్కుకున్న నేపాల్‌కు అండగా కే-పాప్‌ స్టార్‌..

జలప్రళయంతో తీవ్రంగా దెబ్బతిన్న హిమాలయ దేశం నేపాల్‌ను ఆదుకునేందుకు పలు దేశాలు, ప్రముఖులు ముందుకొస్తున్నారు. తాజాగా కే-పాప్‌ స్టార్‌, ‘స్ట్రే కిడ్స్‌’ సభ్యుడు లీ నో తన దాతృత్వాన్ని చాటుకున్నారు. నేపాల్‌ వరద బాధితుల సహాయార్థం 100 మిలియన్‌ దక్షిణ కొరియా వన్‌లను (సుమారు రూ.69 లక్షలు) విరాళంగా అందించారు. వరల్డ్‌ విజన్‌ సంస్థ ద్వారా ఈ మొత్తాన్ని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు వినియోగించనున్నారు. ఈ కష్ట సమయంలో నేపాల్‌కు తన వంతు సాయం అందించాలనే ఉద్దేశంతో ఈ విరాళం ఇచ్చినట్లు లీ నో తెలిపారు. నేపాల్‌ ప్రజలు వీలైనంత త్వరగా ఈ విపత్తు నుంచి కోలుకోవాలని ఆకాంక్షించారు.

లీ నో 2014 నుంచి వరల్డ్‌ విజన్‌తో కలిసి ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలకు మద్దతు అందిస్తున్నారు. 2024లో ఆహార సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న దేశాల కోసం 100 మిలియన్‌ వన్‌లను విరాళంగా ఇచ్చారు. గతేడాది తన పుట్టినరోజు సందర్భంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారి కోసం కూడా భారీ విరాళం అందించారు. మరోవైపు భారత ఆధ్యాత్మికవేత్త, ఈశా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్‌ కూడా నేపాల్‌ వరద బాధితులకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. నేపాల్‌ ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళంగా అందించనున్నట్లు ప్రకటించారు. ఈ వరదల్లో ఈశా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది యాత్రికులు గల్లంతైనట్లు సమాచారం. విపత్తు సమయంలో బాధితులకు అండగా నిలిచిన లీ నో, జగ్గీ వాసుదేవ్‌ విరాళాలు మానవతా దృక్పథానికి నిదర్శనంగా నిలిచాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇండియా పోస్ట్‌లో భారీ ఉద్యోగాల భర్తీ..

ఇండియా పోస్ట్‌లో భారీ ఉద్యోగాల భర్తీ..

మణిపూర్‌లో జనగణన వాయిదా..

మణిపూర్‌లో జనగణన వాయిదా..

హైదరాబాద్‌లో జొమాటో కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ క్లోజ్‌..

హైదరాబాద్‌లో జొమాటో కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ క్లోజ్‌..

చేయూత పెన్షన్ దరఖాస్తులకు మరో 15 రోజుల గడువు..

చేయూత పెన్షన్ దరఖాస్తులకు మరో 15 రోజుల గడువు..

చిరిగిన చెప్పులతోనూ మారథాన్‌లో విజయం...

చిరిగిన చెప్పులతోనూ మారథాన్‌లో విజయం...

ఐవీఎఫ్‌ కేంద్రాలపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ఐవీఎఫ్‌ కేంద్రాలపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ట్యాగ్లు
నేపాల్‌ వరదలులీ నోస్ట్రే కిడ్స్‌కే-పాప్‌ స్టార్‌నేపాల్‌ వరద సహాయంవరల్డ్‌ విజన్‌జగ్గీ వాసుదేవ్‌సద్గురుఈశా ఫౌండేషన్‌నేపాల్‌ ప్రధాని సహాయ నిధివరద బాధితులుమానవతా సాయం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిలక్‌ వర్మ టాటూల వెనుక ఆసక్తికర కథ..
క్రీడలు

తిలక్‌ వర్మ టాటూల వెనుక ఆసక్తికర కథ..

మందులు వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ఆరోగ్యం

మందులు వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

వరదల్లో చిక్కుకున్న నేపాల్‌కు అండగా కే-పాప్‌ స్టార్‌..
జనరల్

వరదల్లో చిక్కుకున్న నేపాల్‌కు అండగా కే-పాప్‌ స్టార్‌..

కార్తి ‘సర్దార్‌ 2’ ట్రైలర్‌ విడుదల..
సినిమాలు

కార్తి ‘సర్దార్‌ 2’ ట్రైలర్‌ విడుదల..

కేసీఆర్‌ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

కేసీఆర్‌ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

ఇండియా పోస్ట్‌లో భారీ ఉద్యోగాల భర్తీ..
జనరల్

ఇండియా పోస్ట్‌లో భారీ ఉద్యోగాల భర్తీ..

మణిపూర్‌లో జనగణన వాయిదా..
జనరల్

మణిపూర్‌లో జనగణన వాయిదా..

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ గుడ్‌బై..
క్రీడలు

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ గుడ్‌బై..

‘ఇప్పుడు గోరఖ్‌పూర్‌ స్పెయిన్‌లా ఉంది’ - రవి కిషన్‌
రాజకీయాలు

‘ఇప్పుడు గోరఖ్‌పూర్‌ స్పెయిన్‌లా ఉంది’ - రవి కిషన్‌

బీజేపీ ఆఫీస్లపై దాడులను ఖండించిన స్టేట్ ప్రెసిడెంట్
రాజకీయాలు

బీజేపీ ఆఫీస్లపై దాడులను ఖండించిన స్టేట్ ప్రెసిడెంట్

సౌత్‌లో బిగ్‌బాస్‌ సందడి.. నాలుగు భాషల్లో కొత్త సీజన్ల గ్రాండ్‌ ప్రీమియర్‌
షోస్

సౌత్‌లో బిగ్‌బాస్‌ సందడి.. నాలుగు భాషల్లో కొత్త సీజన్ల గ్రాండ్‌ ప్రీమియర్‌

హైదరాబాద్‌లో జొమాటో కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ క్లోజ్‌..
జనరల్

హైదరాబాద్‌లో జొమాటో కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ క్లోజ్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!