

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత కుటుంబ సమేతంగా కొత్తగూడెంకు వచ్చిన ఆయనకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘన స్వాగతం పలికారు. కొత్తగూడెం కలెక్టరేట్ సమీపంలోని హెలిప్యాడ్ వద్ద చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరికి మంత్రి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు కుటుంబ సమేతంగా కొత్తగూడెం వచ్చారు. అనంతరం పాల్వంచలోని నవభారత్ ప్రాంగణంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి, సతీమణితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో చంద్రబాబు మంత్రివర్గంలో తుమ్మల నాగేశ్వరరావు పనిచేసిన నేపథ్యంలో వీరిద్దరి కలయిక రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!