

శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనుల్లో కీలక పురోగతి నమోదైంది. గతంలో ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతంలోని అత్యంత క్లిష్టమైన భూగర్భ షియర్ జోన్‌ను తవ్వక బృందాలు విజయవంతంగా దాటాయి. బలహీనమైన శిలలు ఉండే ఈ ప్రాంతాన్ని అధిగమించడంతో సొరంగం పనులను మరింత వేగంగా కొనసాగించేందుకు మార్గం సుగమమైందని అధికారులు తెలిపారు. గత ఐదారు నెలల్లో సుమారు 700 మీటర్ల మేర తవ్వకాలు పూర్తయ్యాయి.
మొత్తం 43.968 కిలోమీటర్ల ప్రధాన సొరంగంలో ఇప్పటివరకు సుమారు 79 శాతం పనులు పూర్తయ్యాయి. మరో 9.1 కిలోమీటర్ల మేర తవ్వకాలు మిగిలి ఉన్నాయి. పనుల వేగాన్ని పెంచేందుకు అదనపు యంత్రాలను వినియోగించడంతో పాటు, జర్మనీ నుంచి అత్యాధునిక ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌ను తీసుకురానున్నారు. కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, 2028 జూన్ నాటికి సొరంగం ద్వారా నీటిని అందించేలా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!