
జనరల్

ఫేస్‌బుక్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో తాత్కాలికంగా బ్లాక్ అయిన ఘటనపై మెటా అధికారిక ప్రకటన విడుదల చేసింది. కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ, ఆ వీడియో పొరపాటున తొలగించబడిందని, అనంతరం దాన్ని తిరిగి పునరుద్ధరించినట్లు తెలిపారు. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో మెటా ఈ వివరణ ఇచ్చింది.
వీడియో తొలగింపు సంస్థ విధానాల అమలులో భాగంగా కాదని, సాంకేతిక పొరపాటు కారణంగానే జరిగిందని మెటా స్పష్టం చేసింది. సమస్యను వెంటనే గుర్తించి పరిష్కరించిన తర్వాత వీడియోను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. ఈ ప్రకటనతో తాత్కాలికంగా నెలకొన్న సందేహాలకు మెటా స్పందించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!