

ప్రశాంత్ కిశోర్‌కు చెందిన జనసురాజ్ పార్టీ డిజిటల్ కమ్యూనికేషన్స్ మేనేజర్ దేవ్‌పాలిక్ గుప్తా జార్ఖండ్‌లో మృతి చెందారు. అక్టోబర్ 27, మంగళవారం రైల్వే ట్రాక్‌ల సమీపంలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. రాంచీ నుంచి పాట్నాకు సహచరులతో కలిసి రైలులో ప్రయాణిస్తుండగా సోమవారం ఆయన అదృశ్యమయ్యారు. సహచరుడు గౌతమ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం మధ్యాహ్నం సుమారు 2.25 గంటలకు రాంచీలో జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఎక్కిన గుప్తా, రైలు బయలుదేరిన పది నిమిషాల తర్వాత ఆహారం తీసుకురావడానికి ప్యాంట్రీ కారుకు వెళ్తున్నట్లు చెప్పారు. అయితే తిరిగి రాకపోవడంతో సహచరులు ప్యాంట్రీ కారుతో పాటు ఇతర బోగీల్లో వెతికారు. ఆయన ఆచూకీ లభించకపోగా, ఫోన్ కూడా స్విచ్ఛాఫ్‌లో ఉన్నట్లు తెలిసింది.
రాంచీ జిల్లాలోని మురి సమీపంలోని జార్వాదిహ్ గ్రామం వద్ద రైల్వే ట్రాక్‌ల పక్కన గుప్తా మృతదేహాన్ని గుర్తించారు. స్థానిక పోలీసులను ఉటంకిస్తూ ది అబ్జర్వర్ పోస్ట్ ప్రచురించిన కథనం ప్రకారం, ప్రాథమిక పరిశీలనలో కదులుతున్న రైలు నుంచి ప్రమాదవశాత్తూ పడిపోవడంతో ఆయన మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే, మృతికి గల ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించేందుకు పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతోంది. అధికారిక విచారణ పూర్తయ్యే వరకు ఆయన మృతికి గల కారణంపై స్పష్టత లేదు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!