

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ఒక్కరోజులోనే తొమ్మిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటివరకు 1,177 కేసులు నమోదయ్యాయి. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈరోజు 67 మంది తమ ఆయుధాలను పోలీసులకు డిపాజిట్ చేశారు. అలాగే, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 1,179 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు.
ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 244 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం 33,014 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా, 17,652 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేయగా, ఇప్పటివరకు 9,217 ఆయుధాలను డిపాజిట్ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు కొనసాగుతున్నాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!